యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ” దేవర “. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మువీ పై ఇండియన్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మువీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అందాలతార శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మువీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ నిపుణులతో సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. .
ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తాజాగా కన్ఫర్మ్ చేశాడు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రెల్ 5 విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడట. రెండో పాత్ర కాస్త నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ అని, టెంపర్ తరహాలో తారక్ క్యారెక్టర్ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే మొదటి భాగంలో క్లైమాక్స్ లో ఎన్టీఆర్ చేయబోయే రెండో పాత్ర పరిచయం అవుతుందని.. ఇక దేవర రెండో భాగంలో ఎక్కువ శాతం తారక్ నెగిటివ్ షెడ్ లోనే కనిపిస్తాడని టాక్. ఇదే గనుక నిజం అయితే ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. తారక్ నెగిటివ్ షెడ్ లో కనిపించిన టెంపర్, జై లవ కుశ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు దేవర కూడా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ దేవర కావడంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ – ప్రశాంత్‌లకు 3 స్టార్లు