ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మద్య నువ్వా నేనా అన్నట్లుగా పోలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలవడం ఇటు అధికార వైసీపీకి అటు ప్రతిపక్ష టీడీపీకి రెండు పార్టీలకు కీలకమే. దీంతో రెండు పార్టీల అధినేతలు వేస్తున్న వ్యూహాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా జగన్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఒకరకంగా చంద్రబాబు సక్సస్ అయ్యారనే చెప్పాలి. బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రనికి, సైకో పోవాలి సైకిల్ రావాలి.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
అలాగే నియోజిక వర్గాల వారికి పర్యటిస్తూ నిర్మాణం జరగని ప్రాజెక్ట్ లను సందర్శిస్తూ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అటు ప్రజల్లో జగన్ పాలనపై వ్యతిరేకత పెరగడం ఇటు పార్టీకి మైలేజ్ రావడం రెండు ఒకేసారి జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసుకొని.. ఆయన పాలనలో జరిగిన అవినీతి అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో జగన్ ప్రయోగించిన అస్త్రానికి బాబు కంగుతిన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అమరావతి రాజధాని నిర్మాణంలో ఇన్నోవేషన్ కాంట్రాక్ట్ ల విషయంలో బాబు స్వయంగా అవినీతికి పాల్పడ్డారని లెక్కలో లేని రూ.118 కోట్లు స్వయంగా ఆయన చేతికి అందాయని ఊహించని విధంగా ఐటీ నోటీసులు జారీచేసింది.
Also Read:ఆ ఇద్దరితో ‘బేబీ’ బ్యూటీ రొమాన్స్
దీంతో ఒక్కసారిగా చంద్రబాబు డైలమాలోకి వెళ్లారు. ఈ నోటీసులపై బాబు ఇంతవరకు సరిగా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది నిజమేనేమో అని అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. టీడీపీ నేతలు కూడా దీనిపై స్పష్టంగా స్పందించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఐటీ శాఖ ఆధారాలతో సహ నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు అండ్ కో తెలుకుట్టిన దొంగల వలె సైలెంట్ అయ్యారు. ఇక త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న బాబు.. ఇప్పుడు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే దానిపై దృష్టి సారించారు. మొత్తానికి చంద్రబాబును డిఫెన్స్ లో పడేయడంలో జగన్ గట్టిగానే సక్సస్ అయ్యారనే చెప్పాలి.