వాళ్ళకు సీటు ఇచ్చి..జగన్ తప్పు చేశాడా?

29
- Advertisement -

గత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి అంతకు మించి అనేలా టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు, అందులో భాగంగానే తాజాగా 175 స్థానాలకు గాను అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే సీట్ల కేటాయింపులో భారీగానే మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 80కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చడం సీట్లు నిరాకరించడం వంటివి చేశారు. అయితే ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి సీట్లు నిరాకరిచడం సహజమే అయినప్పటికి.. ఓ నలుగురి విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు పాటించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్.. వంటివారిపై అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతూ వచ్చింది.

ఎందుకంటే వారు మాట్లాడే విధానం, భాష వైఖరి, దిగజారుడు రాజకీయం.. ఇవన్నీ కూడా ఈ నలుగురిపై కొంత నెగిటివిటీ పెరగడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వీరికి సీటు కేటాయించడం కష్టమే అని భావించారంతా. కానీ ఊహించని రీతిలో వీరికి జగన్మోహన్ రెడ్డి సీట్లు కేటాయించారు. ఎప్పటిలాగే కొడాలి నానికి గుడివాడ, ఆర్కే రోజా నగరి, అంబటి రాంబాబు సత్తెనపల్లి, గుడివాడ అమర్నాథ్ గాజువాక.. సీట్లు కేటాయించింది వైసీపీ పార్టీ,

అయితే ఈ నలుగురికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి జగన్ తప్పు చేశారనే వాదన రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. వీరిపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయం తెలిసి కూడా జగన్ సీట్లు కేటాయించడం వైసీపీని దెబ్బ తీసే అంశమే అనేది కొందరి అభిప్రాయం. అయితే ప్రత్యర్థి పార్టీ నేతలకు ధీటైన సమాధానం ఇచ్చే విషయంలో ఈ నలుగురు ముందు వరుసలో ఉంటారు, వీరికి సీట్లు నిరాకరిస్తే.. వీరు పార్టీలో సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈ నలుగురికి వైఎస్ జగన్ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ప్రజల్లో నెగిటివిటీ భారీగా ఉన్న ఈ నలుగురికి విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.

Also Read:పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

- Advertisement -