జగనన్న స్టిక్కర్లు.. పబ్లిసిటీ పిచ్చేనా ?

31
jagan
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సి‌ఎం జగన్ చేపడుతున్న పలు కార్యక్రమాలు.. కొసింత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ” గడపగడపకు మన ప్రభుత్వం ” పేరుతో వైసీపీ నేతలందరిని నేరుగా ప్రజల్లో ఉంచిన జగన్.. ఇప్పుడు ఏకంగా ప్రజలనే తనవైపు తిప్పుకునేలా ” మా నమ్మకం నువ్వే జగన్ ” అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్నీ ఇళ్లకు సి‌ఎం జగన్ స్టిక్కర్లు అంటించే విధంగా వైసీపీ సర్కార్ సిద్దమౌతుంది. అయితే ఎందుకు ఈ వినూత్న కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది అనే దానిపై రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో జగన్ సర్కార్ అందిస్తున్న పథకాల ద్వారా లభ్ది పొందుతున్న కుటుంబాలు.. జగన్ చేస్తున్న పథకాలను మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొందరి అభిప్రాయం..

ఇదిలా ఉంచితే సి‌ఎం జగన్ అధికారం చేపట్టినది మొదలుకొని.. ఇప్పటివరకు అన్నిట్లోనూ వైసీపీ జెండా రంగులనో లేదా తనను తాను హైలెట్ చేసుకోవడమో చేస్తున్నారు. సచివాలయం వ్యవస్థ ప్రారంభించిన తరువాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ కు పార్టీ రంగులు వేయడం. ప్రజల ప్రాపర్టీ అయిన ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటోలు ఉండేలా చూసుకోవడం.. ఇలా ఒకటేంటి అన్నిటిని కూడా సి‌ఎం జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటూనే ఉన్నారు. అయితే సి‌ఎం జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానిపై రకరకాల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇదంతా కూడా వైఎస్ జగన్ పబ్లిసిటీ పిచ్చితోనే చేస్తున్నారని కొందరి వాదన.

ఇక ఇటీవల చేపట్టిన ఇంటింటికి జగనన్న స్టిక్కర్లు కార్యక్రమం పై టీడీపీ, జనసేనలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నాయి. ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ దీనిపై స్పందిస్తూ.. ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పబ్లిసిటీ పిచ్చితోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే భయంతోనే ఇంటింటికి జగనన్న స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఎలాగూ మంత్రులపై, ఎమ్మెల్యేలపై జగన్ కు నమ్మకం లేదు కాబట్టి ముందు వాళ్ళకి జగనన్న నమ్మకం అని పచ్చబొట్లు వేయించండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు నాదెండ్ల మనోహర్. ఇక టీడీపీ కూడా జగన్న స్టిక్కర్ల పై గట్టిగానే వ్యంగ్యస్త్రాలు సందిస్తోంది. ఏది ఏమైనప్పటికి జగనన్న స్టిక్కర్లతో రాష్ట్ర రాజకీయాలు మరొక్కసారి వేడెక్కాయి. ఇప్పటికే ” గడపగడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంలో వైసీపీ పాలకులపై చీవాట్లు కురిపిస్తున్న ఏపీ ప్రజానీకం. ఇంటింటికి జగనన్న స్టిక్కర్లు కార్యక్రమం పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -