ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌

76
ntr
- Advertisement -

ప్రతి హీరో తన కెరీర్‌లో డ్యూయెల్‌ రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. అలనాటి సినీయర్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి ఎన్టీఆర్‌ వరకు డ్యూయెల్‌ రోల్‌ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్‌ టాక్‌.

ఎన్టీఆర్‌, కేజీయఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి చేసే సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడట. వాటిలో ఒకటి నెగిటివ్‌ రోల్‌ అని టాలీవుడ్‌ ప్రచారం.  ఎన్టీఆర్‌ రెండు పాత్రల్లో కనిపిస్తాడంటే వాటిని ప్రశాంత్‌ నీల్‌ ఏ రేంజ్‌లో డిజైన్‌ చేశాడో ఊహించుకోవచ్చు. ఆల్రెడీ రిలీజైన లుక్‌ కూడా కాస్త నెగిటివ్‌ షేడ్‌లోనే ఉండడాన్ని బట్టి ఇది నిజమనిపిస్తోంది.

విలన్‌ పాత్రలు పోషించడం ఎన్టీఆర్‌కు కొత్తేమీ కాదు. ఇప్పటికే జై లవకుశ సినిమాలో జై పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముగియగానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే… ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌.

- Advertisement -