ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు?

0
- Advertisement -

ఇజ్రాయెల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అధికారానికి గండం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది.

ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మొత్తం 120 స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. తాజా ఫలితాల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు దక్కగా, ఐసెన్‌కోట్‌ కూటమి 48 సీట్లతో నిలిచింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇరు కూటములూ ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐసెన్‌కోట్‌కు చెందిన యషార్ పార్టీ 21 సీట్లు సాధించింది. మరోవైపు రెండు అరబ్ పార్టీలకు కలిపి 19 స్థానాలు లభించాయి. ఈ పార్టీల మద్దతు లభిస్తే ఐసెన్‌కోట్‌ కూటమి బలం 67కు చేరే అవకాశం ఉంది. దీంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సులభంగా సాధించగలరు.

అయితే అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఐసెన్‌కోట్‌ కూటమిలోనే కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి పొత్తుల చర్చలను మరింత క్లిష్టంగా మార్చింది. ఏ కూటమికీ అవసరమైన మెజార్టీ రాకపోవడం, పొత్తులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 2019 నుంచి దేశంలో ఏడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.

Also Read:ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం!

- Advertisement -