Ginger:అల్లం అతిగా తింటే ప్రమాదమా?

53
- Advertisement -

వంటింట్లో వాడే మసాలా దినుసుల్లో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. ఇది కూరల రుచిని పెంచడంలో సహాయ పడుతుంది. అయితే అల్లన్ని కేవలం వంటింట్లో మాత్రమే కాకుండా ఆయుర్వేద ఔషధ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే అల్లంలో ఎన్నో రోగాలను నయం గుణాలు మెండుగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలోని వివిధ వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. అయితే అల్లం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ దానికి మితంగానే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అల్లన్ని అధికంగా తింటే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. అల్లాన్ని ఐదు లేదా ఆరు గ్రాముల కంటే అధికంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందట..

తద్వారా కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అల్లం ఎక్కువగా తీసుకుంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా పొంచివుందట. ఇక వివిధ రోగాల నిమిత్తం నిత్యం మెడిసిన్ తీసుకునే వారు కూడా అల్లన్ని పరిమితి మేర తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేదంటే చర్మంపై అలెర్జీ, పొక్కులు, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందట. ఇంకా అల్లం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయట. అలాగే నిద్రలేమి సమస్య కూడా వెంటాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక డయాబెటిస్ ఉన్నవారికి అల్లం ప్రయోజనకరమే కానీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉందట. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లన్ని మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:క‌విత జ్యుడీషియ‌ల్ రిమాండ్ పొడిగింపు..

- Advertisement -