పఠాన్‌ని మించిన గదర్ 2!

15
- Advertisement -

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది గదర్ 2. రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ శర్మ ఈ మూవీని తెరకెక్కించగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికే రూ. 510 కోట్ల నెట్ కలెక్షన్ ని సొంతం చేసుకోగా మరో రూ. 15 కోట్లు రాబడితే పఠాన్ ని దాటేసి ఆల్ టైం రికార్డును సృష్టించనుంది. మిథూన్ సంగీతం అందించగా జీ స్టూడియోస్ – అనిల్ శర్మ ప్రొడక్షన్స్, ఎమ్ ఎమ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

అయితే జవాన్ రూపంలో గదర్‌ 2 వసూళ్లకి బ్రేక్ పడే అవకాశం ఉంది. నిన్న రిలీజైన జవాన్‌ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ని జవాన్ కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో పఠాన్‌ సినిమా వసూళ్లను బ్రేక్ చేసేందుకు గదర్‌ 2కి మరికొంత సమయం పట్టవచ్చు. ఏదిఏమైనా బాక్సాఫీస్ వద్ద గదర్ 2 అదిరే రికార్డ్స్ సొంతం చేసుకుంది.

Also Read:ఈ శతాబ్దపు విజయం..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

- Advertisement -