ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. ప్రజాభిప్రాయాన్ని బట్టి ఎన్నికల్లో ఓ పార్టీ గెలవడం మరో పార్టీ ఓడిపోవడం సర్వ సాధారణమే. అయితే కొన్నిసార్లు ఓటమి చవిచూసిన పార్టీలు ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతూ ఉంటాయి. తాజాగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేక ఆ పరాభవాన్ని ఈవిఏంల వైపు మళ్లిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు పట్టున రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ ఘోరంగా డీలా పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి.
” తాము బటన్ నోక్కామని, కానీ ఓట్లు ఎక్కడికి పోయాయో తెలియదని, ఈవిఏం లను హ్యాక్ చేశారని ” ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చెసిన వ్యాఖ్యలపై మండి పడుతున్నారు నెటిజన్స్. “మరి తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది కదా ఇక్కడ కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారా ? ‘ అంటూ హస్తం నేతలపై మండిపడుతున్నారు రాజకీయ అతివాదులు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఓటమిని స్వీకరిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఎంతో హుందాగా చెబుతుంటే.. మూడు రాష్ట్రాల్లో ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ ఓటమిని ఈవిఏంల వైపు మల్లిస్తూ హస్తంపార్టీ వంకర బుద్దిని బయటపెడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచే బిఆర్‌ఎస్ కు అధికారమదంతో ఉన్న కాంగ్రెస్ కు ఉన్న తేడా ఏంటో దిగ్విజయ్ సింగ్ చెసిన వ్యాఖ్యలతో బయటపడిందని చెబుతున్నారు రాజకీయ వాదులు.
#WATCH | "We will talk about this later…" says senior Congress leader #DigvijayaSingh when asked about his tweet raising questions on the credibility of EVMs
(📹ANI) pic.twitter.com/5wRCMtVZEK
— Hindustan Times (@htTweets) December 5, 2023