జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా?

77
- Advertisement -

జీడిపప్పు గురించి మనందరికి తెలిసిందే. చాలమంది ఎక్కువగా తినే డ్రై ఫ్రూట్స్ లలో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని వంటల్లోనూ స్వీట్ల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. జీడిపప్పులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, కాఫర్, మంగనిష్, జింక్, పొటాషియం వంటి వాటితో పాటు విటమిన్ ఇ, ఒమేగా 3 వంటివి కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీడిపప్పులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండె జబ్బులను దూరం చేస్తుందని పలు అద్యయానాలు చెబుతున్నాయి. .

అలాగే వీటిలో ఉండే పొటాషియం రక్తంలోని హెట్టుతగ్గులను నియంత్రించి రక్త పోటును అదుపులో ఉంచుతుంది. జీడిపప్పులో ఉండే ఇనుము మరియు ఒమేగా 3 వంటివి జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కూడా. ఇక జీడిపప్పులో ఉండే లూటీన్ వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి. అందుకే వృద్దాప్యంలో ఉన్నవాళ్ళు జీడి పప్పు తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే జీడిపప్పు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:ప్రకాశ్‌ రాజ్‌, కార్తీపై పవన్ సీరియస్

జీడి పప్పులో ప్రోటీన్లు కెలోరీల శాతం అధికంగా ఉంటుంది. ఎంతో వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు జీడిపప్పు కు దూరంగా ఉండాలి. ఇక పచ్చి జీడిపప్పు తినకూడదు. ఎందుకంటే ఇందులో కిడ్నీల్లో రాళ్ళను ఏర్పరిచే రసాయనం ఉంటుంది. అందువల్ల జీడిపప్పును కాల్చిగాని లేదా డ్రైగా మారిన తర్వాతనే తినాలని నిపుణులు చెబుతున్నారు. కొంత మందిలో జీడిపప్పు అలెర్జీకి కారణం అవుతుంది. ఇక జీడి పప్పును ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జీడిపప్పును మితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

- Advertisement -