నెంబర్ వన్ హీరోయిన్ తల్లి కాబోతుందా?

25
- Advertisement -

బాలీవుడ్‌ హీరో రణ్ వీర్ సింగ్ అందాల సతీమణి దీపికా పడుకోణె తల్లి కాబోతుందని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీపికా పడుకోణె ఐదేళ్ల క్రితం రణ్ వీర్ సింగ్ ను పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన ఐదు ఏళ్ళు తర్వాత నుంచి తన భర్త రణ్ వీర్ సింగ్ తో ముంబైలోనే కాపురం పెట్టింది. కానీ ఎన్నడూ పిల్లల గురించి ఆమె ఆలోచించలేదు. కానీ ఉన్నట్టు ఉండి ఈ 37 ఏళ్ల క్రేజీ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది.

ఇప్పటి వరకు అయితే దీపికా పడుకోణె నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయాన్ని దీపికా జంట కలిసి అధికారికంగా ప్రకటిస్తారనే టాక్ నడుస్తోంది. కేవలం తాను తల్లి కాబోతున్న సందర్భంగా ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని దీపికా పడుకోణె ప్లాన్ చేసుకుంటుందట. అసలు ఇంతకీ దీపికా పడుకోణె తల్లి కాబోతుంది అనే వార్త ఎలా పుట్టుకొచ్చింది అంటే.. తాజాగా దీపికా పడుకోణె ఎయిర్‌ పోర్టులో కనిపించిన లుక్ హిందీ మీడియాలో చర్చకు దారి తీసింది.

Also Read:ఆ డైరెక్టర్ పరిస్థితి ఇక కష్టమే

ఆ వీడియోలో దీపికా పడుకోణె ఉదర భాగం ఎత్తుగా కనిపించింది. దాంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడం వల్ల దీపికా పడుకోణె ప్రెగ్నెంట్‌ అయిందని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దీపికా పడుకోణె తన వివాహ బంధంలో మునిగితేలుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా గ్లామర్ హీరోయిన్ గా నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న దీపికా పడుకోణె ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. మరి తల్లి అయ్యాక.. మళ్లీ హీరోయిన్ గా నటిస్తుందో లేదో చూడాలి.

Also Read:నోటి దుర్వాసనా..అయితే జాగ్రత్త!

- Advertisement -