టీపీసీసీ అధ్యక్షుడు రెంవత్ రెడ్డి ఇటీవల కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు అన్నీ సర్వసాధారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల టైమ్ లో కేసిఆర్ వద్ద రూ. 25 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ తీసుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. ఈటెల చేసిన వ్యాఖ్యలను ఇటు బిఆర్‌ఎస్ నేతలు, అటు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ఖండించారు. రేవంత్ రెడ్డి ఏకంగా అమ్మవారిపై ప్రమాణం చేస్తూ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ఈటెల నిరాధార ఆరోపణలాపై రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు..
అయితే ఆరోపణలు రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదు. అయినప్పటికి ఆయన ప్రస్తుతం కన్నీరు పెట్టుకోవడమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడానికి తెరముందు ఈటెల కారణం అయితే తెరవెనుక కాంగ్రెస్ లోని అంతర్మథనమే కారణం అని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా తీవ్ర వ్యతిరేకత చూపుతూ వచ్చారు. సీనియర్ నేతలంతా ఒకవైపు రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. ఒకానొక టైమ్ లో రేవంత్ రెడ్డీని అధ్యక్ష పదవి నుంచి గద్దె దించేందుకు కూడా పార్టీలోని సీనియర్స్ గట్టి ప్రయత్నాలు చేశారు.
Also Read:రఘునందన్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
ఇక పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా ప్రతిఒక్కరు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం, పార్టీ లో ఏర్పడ్డ అనిశ్చితి వల్ల క్యాడర్ బలహీన పడుతూరావడం, రేవంత్ తీసుకునే ఏ నిర్ణయానికి సీనియర్స్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం వంటి ఎన్ని కారణాలు గత కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డీని తీవ్రంగా భాధిస్తున్నాయనేది కొందరి వాదన. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డీని వ్యతిరేకించే పార్టీ సీనియర్స్ కు ఊతం ఇచ్చే విధంగా ఈటెల చేసిన ఆరోపణలు ఉండడంతో రేవంత్ రెడ్డి మనస్తాపానికి గురై కన్నీరు పెట్టుకున్నారని రాజకీయ వాదుల అభిప్రాయం. మొత్తానికి కారణాలు ఏవైనప్పటికి రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:Virupaksha:యుఎస్ బాక్సాఫీస్ షేక్