పార్టీకి నో క్రెడిట్.. ఏంటిది షర్మిల?

14
- Advertisement -

ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వైసీపీ నేతలపై, తన అన్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచారు. వైసీపీ వల్ల రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని తనదైన రీతిలో ఘాటు విమర్శలు గుప్పించారు. షర్మిల ఎంట్రీతో ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ వార్తల్లో నిలుస్తోంది. పైగా ఆమె చేసే వ్యాఖ్యల కారణంగా హస్తంపై విపరీతమైన హైప్ ఏర్పడుతోంది ఏపీ కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు ప్రస్తుతం షర్మిల సిద్దమౌతున్న వేళ.. ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం రోజున షర్మిల మాట్లాడుతూ ” తెలంగాణలో కే‌సి‌ఆర్ ను గద్దె దించానని.. బి‌ఆర్‌ఎస్ ఓటమిలో తన పాత్రే ఎక్కువగా ఉందనే ” విధంగా వ్యాఖ్యానించారు.

నిజానికి తెలంగాణ షర్మిల పెద్దగా ప్రభావం చూపలేదనే విషయం జగమెరిగిన సత్యం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన హామీలే అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి బి‌ఆర్‌ఎస్ ఓటమి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుని రాజకీయ లభ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది షర్మిల. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవర పెడుతోందట. ఎలాంటి ప్రభావం చూపని తెలంగాణలోనే కాంగ్రెస్ విజయంలో భాగముందని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్న షర్మిల.. ఇక ఏపీ అసలు పార్టీకి క్రెడిట్ ఇవ్వకుండా తానే సర్వం అనేలా వ్యవహరిస్తుందేమో అనే భయం కొంతమంది హస్తం పెద్దలలో కనిపిస్తున్నాట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీకి క్రెడిట్ ఇవ్వకపోతే ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ ఆశలు ఆవిరైనట్లే. మరి షర్మిల కారణంగా కాంగ్రెస్ బలపడుతుందా లేదా మరింత బలహీన పడుతుందా అనేది చూడాలి.

Also Read:Budget 2024:ఈ 5 అంశాలే ఫోకస్

- Advertisement -