రైతుబంధు బ్రేక్.. కుట్ర ఎవరిది?

42
- Advertisement -

తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలో జరుగుతున్నాయా ? అంటే తాజా పరిణామాలు చూస్తే అవునని చెప్పక తప్పదు. స్వతంత్ర నిర్ణయాలకు కేంద్రంగా ఉండాల్సిన ఈసీ పార్టీలకు కొమ్ము కాయడం నిజంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విషయమే. ముఖ్యంగా రైతుబంధు పథకం విషయంలో ఈసీ వ్యవహరించిన తీరు చూస్తే ఈసీ వెనకున్నదెవరు అనే సందేహాలు రాక మానవు. రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణలో రైతుబంధు పథకం అమలౌతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రప్రథమంగా పెట్టుబడి సాయం కింద రైతులకు నగదు అందజేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ప్రతి ఏడాది కూడా జూన్ / జులై తో పాటు డిసెంబర్ / జనవరి మసాల్లో రైతు బంధుకు సంబంధించిన నగదు రైతుల ఖాతాలో జమ అవుతుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నవంబర్ 30 న ఎన్నికలు జరగనుండటంతో డిసెంబర్ లో విడుదల చేయాల్సిన రైతు బంధు నిధులు కాస్త ముందుగానే విడుదల చేయాలని కే‌సి‌ఆర్ సర్కార్ భావించింది. అందుకు సంబంధించి మొదట ఎన్నికల కమిషన్ అనుమతి కూడా ఇచ్చింది. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం విరబూసిన పరిస్థితి. కానీ అనూహ్యంగా రైతుబంధు నిధులకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరి మొదట అనుమతి ఇచ్చిన ఈసీ ఇప్పుడెందుకు సడన్ గా మాట మార్చింది ? అసలు రైతుబంధు కు బ్రేక్ పడటానికి ఎలక్షన్ కమిషన్ చూపిస్తున్న కారణం ఏంటి ? దీని వెనుక ఎవరున్నారు ? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాలకు అనుమతి ఉండదు. కానీ పాత పథకాలు అపెందుకు కూడా వీలు లేదు. దాంతో పాత పథకాలు యథావిధంగా కొనసాగించవచ్చు. అందుకే ఎన్నికల కమిషన్ మొదట రైతుబంధుకు పర్మిషన్ ఇచ్చింది.

కానీ ఇంతలోనే రైతుబంధు ఎలక్షన్ కోడ్ కు విరుద్ధం అంటూ మళ్ళీ బ్రేక్ వేసింది. దీంతో అసలు ఎన్నికల కమిషన్ కు అవగాహన ఉందా ? ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. పీఎం కిసాన్ నిధుల విడుదల కు అనుమతి ఇచ్చిన ఈసీ.. రైతుబంధుకు మాత్రం బ్రేక్ వేసింది.. ఇక్కడే ఈసీ బీజేపీకి కొమ్ము కాస్తోందనే విషయం స్పష్టమౌతోందని రాజకీయ వాదులు చెబుతున్నారు. పైగా ఇటీవల రైతుబంధు ను రద్దు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన తరువాత అనూహ్యంగా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం బయట పడుతోందనేది కొందరి వాదన.

Also Read:CM KCR:అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం..

- Advertisement -