ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసింది. బీజేపీ ని నేరుగా ఎదురుకునే సత్తా లేనప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో మద్దతు ఇస్తే ఇవాళ బీజేపీ ని కట్టడి చేసే అవకాశం ఉండేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కావాలని బీజేపీ గెలుపు కోసమే ఢిల్లీలో ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి లో అతి ఎక్కువ ప్రభావంతమైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధానిలో మూడో స్థానాననికి కాంగ్రెస్ వెళ్లగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు పడిపోతుంది.
3 రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీ లు కూడా అమలు చేయకపోవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మరింత గడ్డుకాలం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ బి టీం కాంగ్రెస్ పార్టీ అని తేలిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండించిన నిఖిల్