యూపీఏ మార్పు.. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?

40
- Advertisement -

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ దారిలోనే మరికొన్ని పార్టీలు కూడా బీజేపీ గద్దె ద్మ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విడివిడిగా బీజేపీని ఎదుర్కొంవడం కన్నా ఐక్యంగా కమలం పార్టీకి చెక్ పెడితే.. మోడిని గద్దె దించవచ్చనే వ్యూహంతో విపక్షాలన్నీ ఐక్యత మంత్రాన్ని జపిస్తున్నాయి. ఈ మద్య కాలంలో విపక్షాల ఐక్యత విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాస్త ఎక్కువ చొరవ చూపిస్తూ.. అన్నీ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు గట్టిగా చేశారు. ఐక్యత కోసం కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికి పెద్దగా ఫలితం సాధించలేదు..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా నితీశ్ కుమార్ తో కలిసి ఇతర పార్టీలతో కలిసి అడుగులు వేసింది. ఇక గత నెలలో పాట్నాలో నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాల ఐక్యత కొరకు మొదటి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు విపక్షాల తరుపున నితీశ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యత్వ పార్టీ పాత్రనే పోషిస్తోంది తప్పా పెద్దన్న పాత్ర పోషించడం లేదు. ఇదిలా ఉంచితే నేడు విపక్షాలు ముంబైలో రెండో సారి సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పేరు మార్చే దిశగా విపక్షాలు డిమాండ్ చేశాయట.

Also Read:రేవంత్ కు పొంగులేటి ఎఫెక్ట్ ?

ఎందుకంటే యూపీఏ లో కలవడానికి ఇప్పుడున్న విపక్షాలు చాలావరకు ముందుకు వచ్చే అవకాశం లేదు. ముక్యంగా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు యూపీఏలో చేరడానికి విముఖత చూపుతాయి. దాంతో ప్రస్తుతం అలయిన్స్ దిశగా అడుగులు వేసున్న పార్టీలు కొత్త కూటమిని కోరుకునే అవకాశం ఉంది. అందుకే యూపీఏ ను పేరు మర్చితే ఆయా పార్టీల నుంచి మద్దతు పెరిగే ఉంది. అయితే మరి యూపీఏ పేరు మార్చడానికి కాంగ్రెస్ ఎంతవరకు ఒప్పుకుంటుందనేది ప్రశ్నార్థకమే. యూపీఏ అలాగే ఉండే కాంగ్రెస్ పార్టీ డే పై చేయి అవుతుంది. ఒకవేళ యూపీఏ పేరు మర్చితే కాంగ్రెస్ నామమాత్రపు పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి ఐ‌ఏ‌ఆర్‌ఐ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ విపక్షాల డిమాండ్స్ కు తలొగ్గుతుందో లేదో చూడాలి.

Also Read:డెబిట్ కార్డ్ తో పని లేకుండా..డబ్బు విత్ డ్రా!

- Advertisement -