ఎలక్షన్స్ పై అప్పుడే.. క్లారిటీ!

18
- Advertisement -

దేశంలో ప్రస్తుతం ఎన్నికలపై కన్ఫ్యూజన్ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల వైపు అడుగులు వేస్తుండడంతో ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయనేది ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సాధారణంగా ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నికలు జరుగుతాయా ? లేదా వాయిదా పై అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇప్పటికే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడైనా రెడీ అనే సంకేతాలను అధికార బి‌ఆర్‌ఎస్ ఇచ్చింది. .

అయితే ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో జమిలి ఎన్నికలపై కేంద్రం బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ కీలక వ్యాఖ్యాలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆలోపు నోటిఫికేషన్ వస్తే నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని లేదంటే ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నాట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమావేశాల తర్వాతే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై క్లారిటీ వస్తుందని కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీ జమిలి ఎన్నికలకు కూడా సిద్దమే అని కే‌సి‌ఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల విషయమై ఈ నెల జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే అందరి దృష్టి నెలకొంది.

Also Read:రాత్రి పూట తేనె తినడం మంచిదేనా?

- Advertisement -