చిరు నిజంగానే పది కోట్లు వెనక్కి ఇచ్చేశారా?

33
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కలెక్షన్ల సంగతి ఎలా ఉన్నా, ఈ మూవీపై మాత్రం రూమర్స్ ఆగడంలేదు. చిరు, నిర్మాత అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవ జరిగిందన్న రూమర్స్ పై నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు- నా మధ్య మనస్పర్థలు వచ్చాయనేది పూర్తిగా అబద్ధమంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్లాప్ విషయంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు భోళా శంకర్ కు చిరు తీసుకున్న రెమ్యూనిరేషన్ లో పది కోట్లు నిర్మాతలకు ఇచ్చేసినట్లు వినికిడి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. చిరంజీవి, నిర్మాత అనిల్ సుంకరలలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. మొత్తానికి భోళా శంకర్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ కూడా బాగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

Also Read:ఈ లక్షణాలుంటే…లివర్ చివరి దశే!

తన త‌ర్వాతి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయాలని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కాలికి సర్జరీ అయ్యింది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన మెగాస్టార్ చిరంజీవి 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్‌ చేయించుకున్నారు.

Also Read:25 నుండి అందుబాటులోకి సచివాలయ టెంపుల్..

- Advertisement -