చైనా వెల్లుల్లి…నిజంగా డేంజరా?

56
- Advertisement -

వెల్లుల్లి మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే పదార్థం. కూరల యొక్క రుచిని పెంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలమంది వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. దీనికి కారణం వెల్లుల్లిని.. నమిలినప్పుడు వచ్చే వాసన వల్ల కొంతమంది అలెర్జీగా ఫిల్ అవుతారు. కానీ వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే దివ్యఔశదం గా వెల్లుల్లిని భావిస్తారు ఆయుర్వేద నిపుణులు.

అయితే అలాంటి వెల్లుల్లి చైనా నుండి వస్తుంది అంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఎందుకంటే కరోనా మహమ్మారి తర్వాత చైనా నుంచి ఏది బయటికి వచ్చినా అది ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం చైనా వెల్లుల్లి అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడవుతోంది. దీంతో చైనీస్ వెల్లుల్లి జాతీయ భద్రతకు ముప్పుతో పాటు మానవ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని అమెరికన్ సెనేటర్ ఆందోళన వ్యక్తం చేశారు

చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి కారణంగా అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ పార్టీకి చెందిన రిక్ స్కాట్ అనే ఒక సెనెటర్ కామర్స్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వెల్లుల్లి సురక్షితం కాదని.. వెల్లుల్లి సాగులో చైనా అపరిశుభ్రమైన సాగు పద్ధతులను అనుసరిస్తోందని పేర్కొన్నారు.

జంతువుల వ్యర్థాలతో పోల్చితే మానవ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తున్నారని తేలింది. చైనీస్ వెల్లుల్లిని పెంచే పద్ధతి చాలా ప్రమాదకరమైనదని.. సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చిన నీటిని ఆ పంటకు ఉపయోగిస్తారని డాక్టర్ అన్షుమన్ కుమార్ వెల్లడించారు. అందేకే చైనా వెల్లుల్లిని అంతర్గత భద్రతకు ముప్పుగా అమెరికా భావిస్తోంది. భారీ లోహాలు ఆర్సెనిక్, పాదరసం, ఎముక క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్లకు కారణమవుతాయని అనుమానం వ్యక్తం చేస్తోంది.

Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?

- Advertisement -