బీజేపీలోని కొంత మంది కీలక నేతలకు అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర నిరాశని మిగిల్చాయి. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటివారు అనూహ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈటెల రాజేందర్ ఏకంగా రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ ప్రజలు మాత్రం తిరస్కరించారు. దాంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలని ఆయన చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నా ఈటెల మల్కాజ్ గిరి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరి ఈటెల రాజేందర్ కు అధిస్థానం ఎంపీ టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక బండి సంజయ్ విషయానికొస్తే మొదటి నుంచి కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఓటమి బెరుకుతోనే కనిపించారు. .
ఒకానొక టైమ్ లో ఆయన అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అధిష్టానం ఒత్తిడి మేరకు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి ఓటమి చవిచూశారు. ఆ ఓటమిని మరిపించేలా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు బండి సంజయ్. 2018 ఎన్నికల టైమ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు బండి సంజయ్. ఇక బీజేపీ మరో నేత ధర్మపురి అరవింద్ కూడా మరోసారి ఎంపీ ఎలక్షన్స్ బరిలో నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం కూడా సిట్టింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉండడంతో వీరికి ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అనే టాక్ నడుస్తోంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also Read:వింటర్ లో నిమ్మరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో..?