కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయం అవుతున్నాయి. ఈ ఎన్నికలు ఏ పార్టీ విజయం సాధిస్తుంది ? కన్నడ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారు ? బీజేపీకి మళ్ళీ అధికారం సాధ్యమేనా ? కాంగ్రెస్ జెండా ఎగురుతుందా ? అసలు జేడీ ( ఎస్ ) ప్రభావమెంతా ? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అయితే విజయంపై మాత్రం అన్నీ పార్టీలు ధీమాగానే ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ విజయం పక్కా ని హస్తం నేతలు చెబుతుంటే.. లేదు లేదు మళ్ళీ మాదే అధికారం అని కమలనాథులు చెబుతున్నారు. ఇవన్నీ కాదు ఈసారి మాదే అధికారం అని జేడీఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను కాస్త పక్కన పెడితే బీజేపీ మాత్రం విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. అదేంటి సర్వేలన్ని కాంగ్రెస్ కె అనుకూలంగా ఉన్నాయి కదా ? మరి బీజేపీ అంతా కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటోంది అనే డౌట్ రావోచ్చు. తాజాగా బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే విజయంపై కమలనాథులు ఎంత ధీమాగా ఉన్నారో ఇట్టే అర్థమౌతుంది. ఈ సారి ఎన్నికల్లో 120 -130 స్థానాలను బీజేపీ అలవోకగా గెలుస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన మరోసారి కన్నడనాట కాషాయజెండానే ఎగురుతుందని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు.
Also Read:మోదీకి ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్: కేటీఆర్ ఫైర్
ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్ రోజురోజూకు బలం పెంచుకోవడం, ఇంకోవైపు విపక్షాలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుండడం.. ఇలాంటి వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికి గెలుపుపై బీజేపీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే బీజేపీ నేతలు ఇంత ధీమాగా ఉండానికి కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీకి 90 నుంచి 110 స్థానాలు రావడం కాయం. అలాంటప్పుడు హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవడం కమలనాథులకు వెన్నతో పెట్టిన విద్య అందుకే సీట్ల ఎన్ని వచ్చిన అధికారం తమదే అనే ధీమలో కాషాయ పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి బీజేపీ ధీమా ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.
Also Read:రేవంత్ కన్నీరుకు కారణం కాంగ్రెసే ?