నితీష్ వెన్నుపోటు వెనుక బీజేపీ వ్యూహం!

23
- Advertisement -

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ వ్యవహారం అటు ఎన్డీయే కూటమిలోనూ ఇటు ఇండియా లోనూ అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి ముఖ్య నేతగా ఉంటూ వచ్చిన నితీష్ కుమార్ అనూహ్యంగా అదే కూటమికి షాక్ ఇస్తూ.. ఎన్డీయేలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. గతంలో ఎన్డీఏ కూటమిలోనే ఉన్నప్పటికీ అనివార్య కారణాలవల్ల బయటకు వచ్చారు నితీష్ కుమార్. అప్పటినుంచి బీజేపీని గద్దెదించే లక్ష్యంతో అడుగులు వేస్తూ వచ్చారు. విపక్షాలన్నిటిని ఏకం చేసి ఇండియా కూటమిగా రూపాంతరం చెందడంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు తలెత్తడంతో గత కొన్నాళ్లుగా ఇండియా కూటమిలో అంటి అంటున్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు నితీష్ కుమార్.

ఇక తాజాగా పూర్తిస్థాయిలో ఇండియా కూటమితో తెగ తెంపులు చేసుకొని మళ్లీ ఎన్డీయే తో చేతులు కలపారు. ఇలా గాలి ఎటు వేస్తే అటు అన్నట్లుగా నితీష్ కుమార్ పొత్తులు మారుస్తుండడంతో ముందు రోజుల్లో ఈయన ప్రభావం ఏ కూటమిపై పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా నితీష్ కుమార్ ఇండియా కూటమికి హ్యాండ్ ఇవ్వడం వెనక బీజేపీ ప్లాన్ ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇండియా కూటమిని కూల్చే లక్ష్యంతో నితీష్ కుమార్ ను బీజేపీ పాములా వాడుకుంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో నితీష్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయేలో చేర్చుకోబోమని చెప్పిన కమలనాథులు ఇప్పుడు తిరిగి చేర్చుకోవడమే అందుకు కారణం. ఏది ఏమైనప్పటికి అవకాశవాదిగా పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ ఎన్డీయే లోనైనా స్థిరంగా కొనసాగుతారా ? మళ్లీ వెన్నుపోటుకు పాల్పడతారా? అనేది చూడాలి.

Also Read:Filmfare:ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌

- Advertisement -