ఎలక్షన్స్ టైమ్.. తెలంగాణ బాటాలో ఏపీ?

51
- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఎలక్షన్ మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా ఏపీ లో వచ్చే ఏడాది జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏపీ ఎలక్షన్స్ పై మాత్రం కన్ఫ్యూజన్ నెలకొంది. సాధారణంగా వచ్చే ఏడాది ఏప్రెల్ లేదా మే లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ రకమైన వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికి ప్రస్తుత పరిణామాలు ముందస్తు ఎన్నికలకు సంకేతంగానీ కనిపిస్తున్నాయనేది కొందరి అభిప్రాయం. .

ఆ మద్య వైసీపీకి చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ ఏపీ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్తే మేలని జగన్ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండడంతో స్కామ్ లలో చిక్కుకున్న టీడీపీకి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని, ఈ పరిస్థితులను వైసీపీని అనుకుకూలంగా మార్చుకోవాలంటే ఎన్నికలకు వెల్లడమే మంచిదని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే అక్టోబర్ 10 లోపే అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణలో అక్టోబర్ 10లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణతో పాటే ఏపీలో కూడా ఎలక్షన్స్ వైపు అడుగులు పడుతున్నాయట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:టార్గెట్ 175.. నో బ్రేక్స్?

- Advertisement -