త్రీ క్యాపిటల్స్ జగన్ కు దెబ్బేనా?

27
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మరోసారి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ అయింది. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ త్రీ క్యాపిటల్స్ అంశానికి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు, విపక్ష నేతలు ఎవరు కూడా ఈ అంశానికి మద్దతుగా నిలవడం లేదు. పైగా అమరావతి రైతుల కారణంగా మూడు రాజధానుల ప్రతిపాదనకు కోర్టులో బ్రేక్ పడింది. దీంతో అటు కోర్టును ధిక్కరించి ముందుకు వెళ్లలేక ఇటు ఇచ్చిన మాట విషయంలో వెనక్కి తగ్గలేక జగన్ సర్కార్ సతమతమౌతోంది. .

అయితే రాష్ట్రంలో ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని జగన్ సర్కార్ చెబుతోంది. ఎన్నికలేమో మరో తొమ్మిది నెలల్లో జరగనున్నాయి. మరి ఈ తొమ్మిది నెలల్లో మూడు రాజధానుల నిర్మించడం సాధ్యమేనా. ? ఎలక్షన్ కోడ్ వస్తే జగన్ సర్కార్ పాలన కూడా హోల్డ్ లో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రీ క్యాపిటల్స్ నిర్మించడం సాధ్యం కానీ విషయమని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, త్వరలో జగన్ విశాఖా నుంచి పాలన సాగించనున్నారని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు.

Also Read:‘భోళా శంకర్’తో చిరుకు డిజాస్టర్ తప్పదా?

ఒకవేళ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలంటే కేంద్ర సహకారం ఎంతవరుకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే బీజేపీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉందని, అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇటీవల చెప్పుకొచ్చారు. అంతే కాకుండా త్రీ క్యాపిటల్స్ కు కేంద్రం పూర్తి వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టేశారామె. దీంతో త్రీ క్యాపిటల్స్ విషయంలో జగన్ ను అండగా నిలిచే వారు కరువయ్యారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన పై జగన్ వెనక్కి తగ్గుతారా లేదా అలాగే మొండిగా ప్రవర్తిస్తారా అనేది చూడాలి. మొత్తానికి త్రీ క్యాపిటల్స్ అంశం జగన్ కు గట్టి దెబ్బే అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:హ్యాపీ బర్త్ డే టూ.. సూపర్ స్టార్ మహేష్

- Advertisement -