‘భోళా శంకర్’తో చిరుకు డిజాస్టర్ తప్పదా?

29
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీపై పెద్దగా క్రేజ్ ఏ మాత్రం క్రేజ్ కనిపించడం లేదు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కొంత పరవలేదనిపించినప్పటికి.. టీజర్, ట్రైలర్ వంటివి రొటీన్ మాస్ మసాలా మూవీని తలపిస్తున్నాయి. మూవీలో చిరు హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నప్పటికి.. చిరు ఏజ్ కు తగ్గ పాత్ర కాదనే విమర్శ వినిపిస్తోంది. దీంతో భోళా శంకర్ మూవీతో మెగాస్టార్ డిజాస్టర్ మూటగట్టుకొనున్నారా ? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి..

ఈ మద్య చిరు వరుసగా రీమేక్ కథలకు ఒకే చెబుతున్నా సంగతి తెలిసిందే. అయితే అవి కంటెంట్ పరమైన కథలు కాకుండా రొటీన్ మాస్ మూవీస్ కు ఒకే చెబుతుండడంతో ఆయన అభిమానులు సైతం నిరాశకు లోనౌతున్నట్లు టాక్. మరోవైపు రజినీకాంత్, కమల్ హాసన్, మోహల్ లాల్ వంటి స్టార్ హీరోలు వయసు కు తగ్గ పాత్రలు చేస్తుంటే చిరంజీవి మాత్రం.. ఇంకా కుర్రాడి పాత్రలు ఎన్నుకోవడం ఏంటి అనే విమర్శ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

ఇకపోతే భోళాశంకర్ మూవీపై హైప్ లేకపోవడానికి డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఒక కారణం అని మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఈయన దర్శకత్వంలో వచ్చిన శక్తి, షాడో వంటి గత చిత్రలు హీరోల కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో చాలా కాలంగా మూవీస్ కు దూరంగా ఉన్న మెహర్ రమేష్ కు భోళా శంకర్ మూవీ ద్వారా అవకాశం ఇచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికి పెద్దగా హైప్ లేకపోవడంతో మెగాస్టార్ కు మరో డిజాస్టర్ తప్పదేమో అనే భయంలో అభిమానులు ఉన్నారట. మరి ఎలాంటి అంచనాలు లేని భోళా శంకర్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read:లక్షలాది వ్యూస్‌తో .. “తెలుగింటి సంస్కృతి”

- Advertisement -