గ్రామ ఐక్యతకు నిదర్శనం ఇరుకోడ్ గ్రామంః మంత్రి హరీష్ రావు

490
harish rao
- Advertisement -

గ్రామ ఐక్యతకు నిదర్శనం ఇరుకోడ్ గ్రామం అన్నారు మంత్రి హరీష్ రావు. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇటీవల దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019 పురస్కారానికి ఎంపికైంది.ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర పంచాయతీ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా సిద్దిపేట ఎంపీడీఓ అందుకున్నారు.. స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కోసం దేశ వ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి పోటీ తాకిడి ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాంఘిక సామాజిక అభివృద్ధి అంశంపై సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఇప్పటికే గ్రామంలో పలు కార్యక్రమాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంతగానో ఇతర గ్రామాలకు స్ఫూర్తినిచ్చేలా ఆకట్టుకున్నాయి. కాగా బుధవారం నాడు సిద్దిపేట ఎంపీడీఓ సమ్మి రెడ్డి , egs అధికారి నర్సింగ రావు, స్వచ్ఛత స్వశక్తి కరణ్- 2019 పురస్కారం కింద రూ.8లక్షల రూపాయల క్యాష్, ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామాన్ని ఇబ్రహీంపూర్ తరహాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించి గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములుగా చేస్తూ గ్రామ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. గ్రామ స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ తదితర పలు వినూత్న కార్యక్రమాలకు ఇర్కోడ్ గ్రామాన్ని వేదికగా మార్చి అనుకున్న సత్ఫలితాలను సాధించారు. 2017-18 సంవత్సరంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజంటేషన్ రూపంలో ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలో పొందే పలు అరుదైన జాతీయ పురస్కారాలు అంది పుచ్చుకునేలా గ్రామ రూపురేఖలు మారిపోయేలా గ్రామ ప్రజలంతా మనం చేయాల్సిందల్లా.. మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలని ఏకతాటిపైకొచ్చి మంత్రి హరీశ్ రావు విజన్ అనుగుణంగా అనుకున్న ఫలితాన్ని పొందామని గ్రామ సర్పంచ్, పాలక వర్గం, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

పల్లె అభివృద్ధి చెందాలి అంటే ప్రజల భాగస్వామ్యం.. ఐక్యత తోనే సాద్యం అని..అందుకు నిదర్శనం ఇరుకోడ్ గ్రామం అని మంత్రి హరీష్ రావు అన్నారు..జాతీయ స్థాయి అవార్డు అందుకున్న సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు అభినందనలు తెలిపారు..ఇరుకోడ్ స్పూర్తి గొప్పది అని..అభివృద్ధి.. ఆకుపచ్చ… ఆరోగ్య ప్లాస్టిక్ రహిత గ్రామం గా ఇరుకోడ్ మరెన్నో అవార్డులు అందుకోవాలన్నారు..ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో మరిన్ని గ్రామాలు అభివృద్ధి లో ముందుకు పోవాలని చెప్పారు..ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ..గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -