- Advertisement -
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకపడింది రష్యా. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇరాన్ కు చెందిన 400 డ్రోన్లను వాడుతూ తమ దేశంపై రష్యా దాడులు చేసిందని ఆరోపించారు.
ఇరాన్ తీరుపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది. ఇరాన్ పంపుతున్న డ్రోన్లతో ఉక్రెయిన్ లో పౌరులను చంపుతున్నారని, ఇరాన్ డ్రోన్లను సరఫరా చేయకూడదని అమెరికా హెచ్చరించింది. ఇరాన్-రష్యా చర్యలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.
తాము ఇరాన్ కు స్పష్టమైన సందేశం ఇస్తున్నామని, ఇప్పటికైనా రష్యాకు ఆయుధాల ఎగుమతులను ఆపాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ట్రెండింగ్‌లో నాట్ ఫర్ సేల్…
ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం!
బీఆర్ఎస్ కు అంతర్జాతీయస్థాయిలో మద్దతు
- Advertisement -