ఇషాన్ కిషన్‌ను జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసలు గుప్పించారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల స్పందిస్తూ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన తర్వాత అతనికి మద్దతుగా నిలిచిన భారత జట్టు సెలెక్టర్లు మంచి పని చేశారని ప్రశంసించారు.
రాబోయే టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంకల్లో జరగనుండగా, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీకి ముందు ‘మెన్ ఇన్ బ్లూ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సెలెక్టర్లు ప్రశంసలకు అర్హులు. శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టి కిషన్‌ను ఎంపిక చేయడం అంత సులువు కాదు. కానీ ఆ అవకాశాన్ని కిషన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఆటగాడికీ, సెలెక్టర్లకూ సమానంగా క్రెడిట్ దక్కాలి అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్‌లో వెల్లడించారు.
సెంచరీ చేసిన తర్వాత కూడా వికెట్ల వెనుక నిలబడటం అతని ఫిట్‌నెస్‌ను చూపిస్తుంది. సరైన సమయంలో తన పీక్ ఫామ్‌లోకి రావడానికి అతనికి అవకాశం దక్కింది. తిలక్ వర్మ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ, తనను బెంచ్‌పై కూర్చోబెట్టవద్దని కిషన్ సెలెక్టర్లకు సంకేతం ఇచ్చాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతనికి సమస్య కాదని కూడా ఇది నిరూపిస్తోంది. నెమ్మదైన వికెట్‌పై, ఆఫ్‌సైడ్‌లో అతను ఎలా ఆడతాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
Also Read;కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

