కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు తమ వంతు సాయంగా తెలంగాణలో పనిచేస్తున్న అఖిల భారత రెవెన్యూ అధికారులు(ఇన్‌కం టాక్స్ & కస్టమ్స్, జీఎస్‌టీ అధికారులు) రూ.3,60,500 లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఐ.ఆర్.ఎస్ అధికారుల సంఘం తరఫున హైదరాబాద్ జోనల్ యూనిట్ అదనపు సంచాలకులు ప్రసాద్ ఆదెల్లి, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం, మోహన్ బాబు తదితరులు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును ప్రగతి భవన్‌లో కలిసి విరాళానికి సంబంధించిన చలాన్‌ను అందించారు.
ప్రధాన మంత్రి ప్రారంభించిన పీఎం కేర్‌తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి స్వచ్ఛందంగా విరాళాలను అందించిన తెలంగాణ ఐ.ఆర్.ఎస్ అధికారులను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ, కరోనా లాంటి సంక్షోభ సమయంలో వ్యక్తిగత బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అధికారులు ప్రసాద్ ఆదెల్లి, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం, మోహన్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమర్థ నాయకత్వంలో కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడి, ఆర్థికంగా ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.