IRCTC:వారికి ఏసీ కోచ్‌ల్లో ప్రయాణం నిషేధం!

23
- Advertisement -

భారతీయ రైల్వే నిబంధనల్లో పలు మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, 2025 మే 1 నుంచి వెయింటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన ప్రయాణికులకు స్లీపర్ మరియు ఎయిర్ కండిషన్డ్ (AC) కోచుల్లో ప్రయాణం నిషేధం విధించారు. ఈ నిర్ణయం IRCTC తీసుకున్న మరో కీలకమైన అడుగు.ప్రయాణ పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకున్నారు. దీని ద్వారా రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకే కోచుల్లో చోటు కల్పించడం ద్వారా ప్రయాణికులకు మరింత సేవలను అందించేందుకు దోహద పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం…స్లీపర్ లేదా AC కోచుల కోసం వేటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు సంబంధిత కోచుల్లో ఎక్కడం అనుమతించబడదు. 2025 మే 1 నుండి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు ఈ కొత్త నిబంధనకు అనుగుణంగా ముందే తన టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందస్తు ప్లానింగ్ వల్ల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైల్వే అధికారులు తెలిపారు.

వేటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు తమ రిజర్వేషన్ స్థితిని IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణంలో మార్పులు లేనిపక్షంలో, స్లీపర్ లేదా AC కోచుల్లో ఎక్కకూడదు. నిబంధనలను అతిక్రమించిన ప్రయాణికులు జరిమానా చెల్లించాల్సివచ్చే అవకాశం లేదా తదుపరి స్టేషన్‌లో దిగిపోవాల్సి వస్తుంది.

Also Read:పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్ల అవినీతి

- Advertisement -