భీకర రూపం దాల్చిన పశ్చిమాసియా యుద్ధం

1
- Advertisement -

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకు భీకరంగా మారుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

ఇరాన్ …జెరూసలేం పై క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్..టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఎదురెదురు దాడులు జరుగుతుండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

ఇదిలా ఉండగా యుఏఈలోని Fujairah ప్రాంతంలోని ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాపై దీని ప్రభావం పడే అవకాశముంది.

మరోవైపు, బగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఇరాన్ అనుబంధ గుంపుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో, అమెరికా సైన్యం ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న IRGC స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం.

ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పెద్ద స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశాలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

- Advertisement -