అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామని ఇరాన్ కమాండర్ అన్నారు. ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీమ్ సులేమాని మరణంకు ప్రతీకారం తీర్చుకుంటామని రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అన్నారు. ఇరాన్ ఇటీవలే క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేసిందని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరో స్పేస్ ఫోర్స్ అధినేత అమిరాలి హజీజాదే వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్ అధికారిక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీమ్ సులేమాని చనిపోయిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లో అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. అయితే అమాయక సైనికులను చంపడం మా విధి కాదు అని అన్నారు. సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన మైక్ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదు అని హజీజాదే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి…