ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు హర్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. హర్ముజ్ ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత గల నావిక మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు, వాయు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
ఇది పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో పాటు హిందూ మహాసముద్రానికి కలుపుతుంది. సుమారు 33 కి.మీ వెడల్పు గల ఈ నెరికి, ఉత్తరానికి ఇరాన్, దక్షిణానికి అరేబియన్ ద్వీపకల్పాన్ని విడగొడుతుంది. భారత్ హర్ముజ్ చాలా కీలకం. ఎందుకంటే రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు (మొత్తం దిగుమతుల్లో 5.5 మిలియన్ బ్యారెళ్లలో) ఈ మార్గం ద్వారానే వస్తోంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు బ్యారెల్‌కు $80 వరకు చేరుకునే అవకాశం ఉంది.
Also Read:‘అల్లం టీ’తో ప్రయోజనాలు

