అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రతీకార చర్యల భాగంగా మధ్యప్రాచ్యంలో ఉన్న 8 ప్రధాన వంతెనలను లక్ష్యాలుగా గుర్తించినట్లు తెలిపింది.
ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, పలు కీలక వంతెనలను లక్ష్యంగా గుర్తించారు. అవి:
కువైట్‌లోని షేఖ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా సీ బ్రిడ్జ్
యూఏఈలోని షేఖ్ జాయెద్ బ్రిడ్జ్
అల్ మక్తా బ్రిడ్జ్
షేఖ్ ఖలీఫా బ్రిడ్జ్
సౌదీ అరేబియా–బహ్రెయిన్ మధ్య కింగ్ ఫహద్ కాజ్‌వే
జోర్డాన్‌లో కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్
డామియా బ్రిడ్జ్
అబ్దౌన్ బ్రిడ్జ్
కరాజ్ సమీపంలో ఉన్న B1 బ్రిడ్జ్‌పై ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్ దాడి జరిగింది. ఇది ఇరాన్‌లోనే అత్యంత ఎత్తైన (136 మీటర్లు) వంతెన దాడిలో కొంత భాగం కూలిపోయింది. 8 మంది మృతి చెందగా 95 మంది గాయపడ్డారు. సోషల్ మీడియాలో బ్రిడ్జ్ కూలిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పూర్తి కాలేని, పౌర అవసరాల కోసం ఉన్న వంతెనలపై దాడులు చేయడం శత్రువు నైతిక పరాభవాన్ని సూచిస్తుంది అని వ్యాఖ్యానించారు.
Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

