నేడు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు…

227
- Advertisement -

ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని నేడు హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటనకు రానున్న ఆయనకు ఘన స్వాగతం పలుకడానికి విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు.

రోహానీ నేడు (గురువారం) సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం సాలార్‌జంగ్‌ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అక్కడ నిజాం కాలంలో సాలార్‌ జంగ్‌ కుటుంబం ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న కళాఖండాల విభాగాన్ని, ఖరీదైన రంగు రాళ్ల గ్యాలరీని సందర్శిస్తారని తెలిసింది. మధ్యాహ్నం చార్మినార్‌ను సందర్శించి, సమీపంలోనే ఉన్న మక్కా మసీదులో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు.

Iran President to address people in Hyderabad mosque this ..

రోహానీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. రోహానీ శుక్రవారం రాత్రి ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారని సమాచారం.

పూర్వకాలం నుంచి హైదరాబాద్‌తో ఇరాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. గోల్కొండ నవాబులు కులీ కుతుబ్‌షా పాదుషాల నుంచి అస్‌ఫజాహి పాలకుల వరకు ఇరాన్‌తో సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో సంబంధాలున్న హైదరాబాద్‌లోని ముస్లిం మైనారిటీలు రోహానీకి ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయ సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ మహమ్మద్‌ హఘ్‌ బిన్‌ ఘోమీ మాట్లాడుతూ రోహానీ పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేయడం విశేషమని సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -