‘కోహ్లీ…దూకుడు తగ్గించుకోవాలి’..

199
Virat Kohli needs to 'tone down a bit' as a leader, says Jacques Kallis
- Advertisement -

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ దూకుడుగానే కనిపిస్తాడు. మైదానం లోపలా, బయటా కోహ్లీ దూకుడు మామూలుగా ఉండదు. అయితే ఇదే దూకుడుని కోహ్లీ తగ్గించుకోలంటున్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వస్‌ కలిస్‌.

భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే విరాట్‌ కోహ్లీని దూకుడుకి బ్రేక్‌ పడాలంటున్నాడు. ఆటగాడిగా ఉన్నట్టు నాయకుడిగా ప్రతీసారి దూకుడుగా ఉండకూడదని, ఈ విషయం కోహ్లీ తెలుసుకోవాలన్నాడు.

  Virat Kohli needs to 'tone down a bit' as a leader, says Jacques Kallis

సారథిగా అతనింకా కొత్తేనని, అనుభవం గడించే కొద్దీ విరాట్‌ ప్రశాంతంగా ఉండడం అలవరుచుకుంటాడని భావిస్తున్నానంటూ.. ఆటపై అతని అంకితభావం చూస్తే ముచ్చటేస్తుందని చెప్పుకొచ్చాడు జాక్వస్‌.

ఇక, భవిష్యత్‌లో భారత జట్టు మరింత మెరుగ్గా తయారవుతుందని కలిస్‌ అన్నాడు. భారత్‌ విదేశాల్లో తమ రికార్డును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోందని, ముఖ్యంగా తమకు అలవాటు లేని బౌన్సీ వికెట్లపై రాణించడంపై దృష్టి పెట్టిందని తెలిపాడు.

- Advertisement -