ఐపీఎస్‌…74వ పాసింగ్ పరేడ్

18
- Advertisement -

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) 74వ పాసింగ్ ఔట్ పరేడ్‌ శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి కవాతు ప్రదర్శన వీక్షించిన తర్వాత అమిత్‌షా అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నేషనల్ పోలీస్‌ అకాడమీ నేటితో 75వ వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 195మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ తీసుకోగా…41మంది మహిళా ఐపీఎస్‌లు శిక్షణ తీసుకున్నారు.

2021 బ్యాచ్‌ ఐపీఎస్‌లలో ఇండియా 166, ఫారెనర్స్(నేపాల్, భూటాన్, మాల్దీవ్స్‌, మారిషస్‌) 29 ఉన్నారు. ఇప్పటికే 46వారాల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తం ఫీల్డ్ ట్రైనింగ్‌తో కలిపి 105వారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుత ఐపీఎస్‌లలో ఎక్కువగా ఇంజనీరింగ్‌ చేసిన వారే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 166మందిలో ఇంజినీరింగ్ చదివినవారే 114మంది ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఐదుగురు, ఏపీ క్యాడర్‌కు ఇద్దరు చొప్పున అధికారులను కేటాయించడం జరిగింది. అవినాష్ కుమార్, శేషాద్రిరెడ్డి, మహేష్ బాబా సాహెబ్, శంకేశ్వర్, శివం ఉపాద్యాయ తెలంగాణకు కేటాయించగా… ఏపీకి పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్‌ల కేటాయించారు.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్‌కు పూర్వవైభవం తెస్తాం..

భవిష్యత్‌ ఎలక్ట్రిఫైయింగ్‌: మహీంద్రా

యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉంది:వైట్‌హౌజ్‌

- Advertisement -