లాక్ డౌన్ కొనసాగింపు…ఐపీఎల్ రద్దు…!

328
ipl 2020
- Advertisement -

కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ సీజన్ 13 తొలుత ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్‌ను పలు రాష్ట్రాలు ఏప్రిల్ 3 వరకు పొడగించిన నేపథ్యంలో ఐపీఎల్ సీజన్‌ 13 ఇక జరిగేది అనుమానమే.

ఈ విషయాన్ని స్పష్టం చేశారు బీసీసీఐ అదికారులు. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఫలితంగా ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ జరిగే పరిస్థితి లేదని..ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పదని బీసీసీఐ అధికారులు తెలిపారు.

లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం నుంచి ప్రకటన రాగానే, ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్టు అధికారిక సమాచారం వస్తుందని సమాచారం.

- Advertisement -