ఎప్రిల్ లో జరిగే ఐపిఎల్ మ్యాచ్ ల వేలంపాట నిన్న ప్రారంభమైంది. 8టీం ఫ్రాంచైజీలు ఈవేలం పాటలో పాల్గోన్నారు. 351 మంది నుంచి 70 మందిని లీగ్ లోని 8 జట్లు ఎంపిక చేసుకుంటున్నాయి. టీంఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను కొనుగోలు చేసేందుకు మొదటగా ఎవరూ ముందుకు రాలేదు. వేలం ప్రారంభమై కొన్ని గంటలు గడిచినా యువరాజ్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరకు, యువరాజ్ ను కోటి రూపాయలతో ముంబై ఇండియన్స్ రెండో రౌండ్ లో కొనుగోలు చేసింది.
పదహారేళ్ల యంగ్ ఆల్ రౌండర్ బర్మాన్ ని రూ.1.50 కోట్లకు ఆర్సీబీ, పృథ్వీరాజ్ ను రూ.20 లక్షలకు కేకేఆర్, లివింగ్ స్టన్ రూ.50 లక్షలకు, కీమో పాల్ ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వరుణ్ చక్రవర్తి రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాడు. అతన్ని రూ 8.40 కోట్లతో కింగ్స్ పంజాబ్ జట్టు కొనుగోలు చేయగా, సామ్ కుర్రాన్ ను రూ.7.2 కోట్లతో అదే జట్టు సొంతం చేసుకుంది.
ఈవేలంలో ఆంధ్రా క్రికెటర్ జాక్ పాట్ కొట్టాడు. హనుమ విహారి కనీస ధర రూ.50లక్షలు ఉండగా రూ. 2కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు, అక్షర్ పటేల్ ను రూ.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, మలింగను రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్, హెన్రిక్స్ ను కోటి రూపాయలకు పంజాబ్ జట్టు, వరుణ్ అరోరన్ ను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ టీం కొనగోలు చేసింది.