వీడియో.. అద్భుత క్యాచ్ పట్టిన గ్రౌండ్‌మ్యాన్!

3
- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు రెండో విజయం నమోదు చేసింది. లక్నో విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69), శ్రేయస్ అయ్యర్ (52*) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది పంజాబ్. 23 బంతుల్లోనే ప్రభుసిమ్రన్ సింగ్ అర్థ సెంచరీ చేయడం విశేషం.

ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు చేయగా ఆయుష్ బదోని (41), అబ్దుల్ సమద్ (27), డేవిడ్ మిల్లర్ (19) పరుగులు చేశారు. ప్రభు సిమ్రన్ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఇక పంజాబ్ బ్యాట్స్‌మెన్ వధేరా కొట్టిన షాట్‌ సిక్స్‌ వెళ్లగా గ్రౌండ్ మ్యాన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:HCU భూములను కాపాడాలి..అందరి బాధ్యత

- Advertisement -