ఐపీఎల్ టైమింగ్స్ మారాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి గతేడాది వరకు వారాంతాల్లో మినహా మ్యాచ్ లు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవి. వారాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ఒక మ్యాచ్ ఆరంభం కాగా, తిరిగి రాత్రి 8 గంటలకు మరొక మ్యాచ్ వుండేది. దీంతో లేట్ నైట్ వీక్షకుల ఆదరణ తగ్గింది. దీనిని పునరావృతం కానివ్వకుండా చూడాలని బీసీసీఐని ప్రసార కర్త స్టార్ స్పోర్ట్స్ కోరింది. దీంతో బీసీసీఐ ఆట వేళలు మారుస్తున్నట్లు లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
అయితే వచ్చే సీజన్ నుంచి సాయంత్రం 5.30కి, రాత్రి పోరు 7 గంటలకు మొదలవుతాయి. 11వ సీజన్ నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ సంస్థ కోరిక మేరకే మ్యాచ్ వేళల్ని మారుస్తున్నట్లు లీగ్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించాడు. ‘‘ప్రసారదారు కోరినట్లు మ్యాచ్ వేళల్ని మార్చడానికి పాలకమండలి అంగీకరించింది.
రోజుకు రెండు మ్యాచ్‌లు జరిగేది వారాంతాల్లో మాత్రమే. ఆ రెండు రోజులు ఒక మ్యాచ్‌కు ఇంకో మ్యాచ్ అడ్డం పడినప్పటికీ, వేర్వేరు ఛానెళ్లలో ఒకేసారి మ్యాచ్‌లు చూపించే సౌలభ్యం తమకుందని ప్రసారదారు చెప్పింది’’ అని శుక్లా తెలిపాడు. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలో ఆరంభం కానుంది. మే 27న జరిగే ఫైనల్‌కు కూడా ముంబయే వేదిక. పూర్తి షెడ్యూల్ త్వరలో వస్తుంది. ఈ సీజన్ కోసం బెంగళూరులో ఈ నెల 27, 28 తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగనుంది.a