2నిముషాల్లోనే ఐపిఎల్ ఫైనల్ టికెట్లు ఖతం

243
Ipl Tickets

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపిఎల్ ఫైనల్ కు సమయం దగ్గరపడింది. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఇక నేడు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో జరుగనుంది. విశాఖ వేదికగా ఈమ్యాచ్ జరుగనుంది. ఇక ఈసారి ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం చాల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఎలాంటి హడావుడి లేకుండా ఈ టికెట్లను అమ్మేశారు నిర్వాహకులు. కేవలం రెండు నిముషాల్లోనే టికెట్లన్ని అయిపోయాయి. నిన్న మధ్యాహ్నం 2గంటలకు ఈవెంట్స్ డాట్ కామ్ సంస్ధ ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది. అయితే టికెట్లును అమ్మే ముందు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది.

కేవలం రూ.1500, రూ.2000, రూ.2500, రూ. 5000 టికెట్లను మాత్రమే అందుబాటులో పెట్టింది. మిగతా వాటి గురించి అసలు ప్రస్తావించనే లేదు. కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా టికెట్లు అమ్ముకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఐపిఎల్ అభిమానులు.