డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో GT Tv చీఫ్ ఎడిటర్ BS స్పెషల్ ఇంటర్యూ

257
RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమూవీకి టైగర్ కేసీఆర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈసందర్భంగా కేసీఆర్ బయోపిక్ ను తనకంటే బాగే ఎవరూ తీయలేరంటున్నారు వర్మ. వర్మ టైగర్ కేసీఆర్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఈమూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈమూవీ గురించి “గ్రేట్ తెలంగాణ” టీవి తో చర్చించారు రామ్ గోపాల్ వర్మ.

Bs:   టైగర్ కేసీఆర్ సినిమా మీరు తీయగలరా?
Varma: మాములుగా సినిమా తీయడం అంటే ఎవరయినా తీస్తారు.. కానీ నాకంటే బాగా ఎవరూ తీయలేరు. దానికి కారణం ఏంటీ అంటే ఎప్పుడైనా బయోపిక్ తీసినపుడు చాలా మంది ఆయన ఎప్పుడు పుట్టాడు..ఎక్కడ చదివాడు అది చూపిస్తారు. కానీ నేను కేసీఆర్ వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నా..ఆయన రాజకీయ చరిత్ర చదివాను. ఆయన ఒక గొప్ప నాయకుడు. ఆయన లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. కేసీఆర్ గారిలో నేను మరో గాంధీని చూశా..ఆయన తెలంగాణ తెస్తా అని చెబితే సొంత పార్టీ వాళ్లే నమ్మలేదు. అందుకే నేను నా సినిమాలో ఆడు తెలంగాణ తెస్తే అంటే ఎవడూ నమ్మలే అని ట్యాగ్ లైన్ పెట్టాను.

Bs:   ఈ ఉద్యమం జరిగి అంతా 6 నుంచి 7 సంవత్సారాల కూడా కాలేదు..అందరికి తెలిసిన స్టోరీయే దీన్ని ఎలా చూపిస్తారు మీరూ?
Varma: బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రుల నుంచి వేరై తెలంగాణ వాసుల కోసం ఓ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా కెసిఆర్ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. చాలామంది నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తారు.. పోతారు.. కానీ వారిని మరిచిపోతాం. గాంధీని ఎందుకు మరిచిపోలేము అంటే ఆయన భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారు కాబట్టి. అలాగే కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారు కాబట్టి ఆయనను ఎవరూ మరిచిపోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కెసిఆర్ వల్లనే…దానిని ఎవరూ మార్చలేరు. ఆ కృషి వెనుక ఉన్న పట్టుదల, ఎవరికీ తెలియని అంశాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సిద్దాంతకర్త అయితే కెసిఆర్ అమలు పరిచిన వ్యక్తి. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు పడిన కృషిని నాటకీయంగా చూపించాలనుకుంటున్నాను.

RGV

Bs:    14ఏండ్ల ఉద్యమం..ఆయన సభల్లో లక్షల మంది జనాలు వస్తుంటారు..నిజంగా మీరు సినిమాలో అంత మందిని చూపిస్తారా?
Varma: తప్పకుండా చూపిస్తాను…ఆయన ప్రసంగాలు వినడానికి చాలా మంది వస్తారు. ఉదాహరణకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది ఆయన చివరి రోజుల గురించి తీసిన సినిమా..ఆయన ఇంట్లో లక్ష్మీ పార్వతికి ఆయనకు జరిగిన సంభాషణను చూపించాను. ఆ సినిమా ఒక కంటెన్డ్ ఏరియాలో ఉంటుంది. కానీ ఈసినిమా అంతా అవుట్ డోర్ దాచుకోవడానికి ఏం లేదు. కేసీఆర్ గారి ఉద్యమం, విద్యార్దులు, ఆయన ప్రసంగాలు, పార్లమెంట్ లో జరిగిన సంఘటనలు పెప్పర్ స్ప్రే లాంటివి జరిగాయి. అది చూపించక పోతే ఈసినిమాకు న్యాయం చేయలేమని నా ఉద్దేశం. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తీస్తున్నాం. తక్కువ బడ్జెట్ సినిమా చేస్తే పూర్తిగా న్యాయం చేయలేం. ఫైనల్ గా గాంధీ సినిమా రేంజ్ లో ఈ మూవీని చూపిస్తా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని గ్రాఫిక్స్‌లో చూపించాలనుకుంటున్నాను. మరికొన్ని నిజంగానే ఆర్టిస్ట్‌లను పెట్టించి తీయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ‘టైగర్ కెసిఆర్’ను నేను ఒక సినిమా లాగా చూడటం లేదు. ఇది హిస్టారికల్ డాక్యుమెంట్ లాగా చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని భావి తరాలు తెలుసుకోవాలనుకుంటే ఇలా వచ్చింది అనే ఫీలింగ్ వాళ్లకు వచ్చే ‘టైగర్ కెసిఆర్’ను తెరకెక్కిస్తాను.

Bs:ఇంతకి టైగర్ కేసీఆర్ సినిమా ఎలా తీద్దాం అనుకుంటున్నారు?
Varma: రాజకీయాలలో కెసిఆర్ లాంటి హీరోను ఇప్పటి వరకు చూడలేదు. కెసిఆర్ బయోపిక్ భారీ బడ్జెట్‌తో తీయాల్సిన సినిమా కాబట్టి అలాగే తీయాలి. లేకపోతే తీయకూడదు. ఓ చారిత్రక డాక్యుమెంటరీగా ‘టైగర్ కెసిఆర్’ను తెరకెక్కించాలనుకుంటున్నాను. నేను ఈ సినిమాను సీరియస్‌గా తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే భారత రాజకీయాల్లో నేను కెసిఆర్ కంటే పెద్ద హీరోను ఎప్పుడూ చూడలేదు. ఆయనను దీని కంటే పెద్దగా చూపిస్తా. కెసిఆర్‌ను అభిమానించే వాళ్లు ఆంధ్రాలోనూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నారు.

Bs:   మీరు ఆంధ్రా వాళ్లు కదా ఈసినిమాకు న్యాయం చేస్తారా?
Varma: నేను ఆంధ్రోడిని. మేము తెలంగాణ భాషను చూసి నవ్వేవాళ్లం. నా మొదటి సినిమా శివలో ఉత్తేజ్‌తో తెలంగాణ రామాయణం అని కామెడీ ట్రాక్ పెట్టాను. ఆ సమయంలో బి.నర్సింగరావు మా భూమి అనే సినిమా తీశారు. ఆ సినిమాలో తెలంగాణ భాషను ఆంధ్రావాళ్ల పడిపడి నవ్వే వాళ్లు. ఎందుకంటే ఆంధ్రావాళ్లు అప్పటివరకు తెలుగులో తెలంగాణ భాషను చూడలేదు. ఆంధ్రాలో డబ్బున్న వాళ్లు…పదవుల్లో ఉన్న వాళ్లు తెలంగాణను ఎప్పు డూ సీరియస్‌గా చూడలేదు. అది నిజం. ఎప్పుడైతే తెలంగాణ వాళ్లను తక్కువగా చూస్తున్నారో అప్పటి నుంచి అసంతృప్తి ప్రారంభమయ్యింది. తర్వాత ఉద్యమం జరిగింది…ఆగిపోయింది… మళ్లీ కొన్ని సార్లు ఉద్యమాలు జరిగాయి..కానీ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం కాలేదు. అన్ని సార్లు ఉద్యమాలు జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడంతో ప్రజల్లో నమ్మకం పోయింది. కానీ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నిజం చేశారు.

Bs:  చంద్రబాబు కోపంతో కేసీఆర్ మీద సినిమా తీస్తున్నారూ అని అంటున్నారు? నిజమేనా?
Varma:చంద్రబాబు మీద కోపంతో కెసిఆర్ బయోపిక్ తీస్తున్నాను అనే మాటలో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఎవ్వరినీ ప్రేమించను…ఎవ్వరినీ ద్వేషించను. చంద్రబాబు లక్ష్మీస్ ఎన్‌టిఆర్ విడుదల చేయనీయలేదు కాబట్టి కెసిఆర్ బయోపిక్ తీస్తున్నాను అనడం మూర్ఖమైన ఆలోచన. ఈ సినిమాలో జగన్ ఎలా ఉంటారు..? విలన్ ఎవరుంటారు..? అనేది తెరమీదనే చూడాలి.

Bs:మీరూ ఏ సినిమా తీసినా ఫర్ ఫెక్ట్ ఆర్టీస్ట్ ను తీసుకువస్తారు..కేసీఆర్ క్యారెక్టర్ లో ఎవరిని పెడదామని అనుకుంటున్నారు?
Varma:నేనింకా ‘కెసిఆర్’ పాత్రలో ఎవరు నటించాలన్న విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా నటీనటులను కూడా అనుకోలేదు. అయితే ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. కెసిఆర్ పాత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ నటించని వ్యక్తినే నేను తెరపై చూపించబోతున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్‌ను ఎంపికచేసుకుంటున్నాను. నా అభిప్రాయంలో ఓ రియలిస్టిక్ సినిమాను తీసేటప్పుడు అందులో కొత్త నటులను ఎంపికచేసుకుంటేనే ఆ సినిమా వర్కవుట్ అవుతుంది. ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

Bs:   ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అన్న ట్యాగ్‌లైన్ వెనకున్న అర్థమేంటంటే
Varma: ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అన్న ట్యాగ్‌లైన్ వెనకున్న అర్థమేంటంటే.. వాడేం చేస్తాడు..? ఏం చేయగలడు..? అని ఎవరైనా ఓ వ్యక్తిని తక్కువ చేసి చూసినప్పుడు.. సదరు వ్యక్తి అనుకున్నది సాధించిన తర్వాత ‘అరె.. అనుకున్నది చేసేశాడే’ అని షాకవుతాం. నా ట్యాగ్‌లైన్ వెనకున్న అర్థం కూడా అదే. ఒకప్పుడు కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన సాధించేశారు. నేను అమర్యాదకరంగా కెసిఆర్‌ను ‘ఆడు’ అనలేదు. ఆ మాటను ప్రేమతో అయినా అనొచ్చు లేదా ఆయనకంటే వయసులో పెద్దవారైనా అనొచ్చు. కెసిఆర్ ఎంత సిఎం అయినా ఆయన క్లాస్‌మేట్స్ ఇప్పటికీ నువ్వు అనే సంభోదిస్తారు కానీ మీరు అనరు కదా..? అది సినిమాలోని డైలాగ్. ఆ డైలాగ్ ఎవరన్నారు..? అన్నది మీరు సినిమాలోనే చూడాలి. టిఆర్‌ఎస్ సంబంధించిన ఒక మంత్రి నాకు ఫోన్ చేసి ‘ఆడు’ అనే గురించి ఆడిగితే దాని గురించి వివరించాను. ‘ఆడు’ అనే పదం గురించి ఎవ్వరికీ అర్థం అయినా కాకపోయినా కెసిఆర్‌కు, కెటిఆర్ అర్థమవుతుందని ట్వీట్ కూడా చేశాను.

Full Interview

Sensational Interview With RGV | RGV New Movie Tiger KCR | Ram Gopal Varma | BS Talk Show | GT TV