పంజాబ్..వరుసగా ఆరో విక్టరీ

8
- Advertisement -

పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక భారీ రికార్డును నెలకొల్పిన మొదటి జట్టుగా అవతరించింది. న్యూ చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్ వివరాలు మీ కోసం:

ఐపీఎల్ 2026లో తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ . తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 254/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, అజేయంగా నిలిచిన తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానల్లీ లక్నో బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. వీరిద్దరూ కలిసి 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రియాన్ష్ ఆర్య:. 37 బంతుల్లో 93 పరుగులు (9 సిక్సర్లు, 4 ఫోర్లు) చేయగా కూపర్ కానల్లీ 46 బంతుల్లో 87 పరుగులు (7 సిక్సర్లు, 8 ఫోర్లు) చేశారు.

వీరిద్దరూ ఎయిడెన్ మార్క్రామ్ వేసిన ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లతో సహా 32 పరుగులు రాబట్టడం విశేషం. చివరిలో స్టోయినిస్ మెరుపులతో పంజాబ్ 254 పరుగుల భారీ స్కోరును అందుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టును పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టడి చేశారు.

రిషబ్ పంత్ (43), మిచెల్ మార్ష్ (40), ఎయిడెన్ మార్క్రామ్ (42) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.ముకుల్ చౌదరి కొట్టిన ‘హెలికాప్టర్ షాట్’ ధోనీని గుర్తు చేస్తూ అభిమానులను అలరించింది.

Also Read:ప్రశాంత్ నీల్ ప్రజెంట్స్..418!

- Advertisement -