ఐపీఎల్ 2025 ఈ నెల 17 నుండి తిరిగి ప్రారంభం కానుండగా జూన్ 3న ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ అర్ధంతరంగా నిలిచిపోవటంతో విదేశీ ఆటగాళ్లు చాలామంది తమ దేశాలకు వెళ్లిపోయారు.
అయితే వీరిలో చాలామంది తిరిగి రావడం కష్టమే. ఎందుకంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వచ్చే నెల 11 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఉండగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు మధ్య సీరిస్ జరగనున్న నేపథ్యంలో ఈ దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం కష్టమే.
ఐపీఎల్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే.. గుజరాత్ జట్టులో రబాడ, షెఫానీ రూథర్ ఫర్డ్, కొయెట్జీ,ఢిల్లీ నుండి మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రెజర్, ట్రిస్టన్ స్లబ్స్, బెంగళూరు నుండి జోష్ హాజిల్‌వుడ్, జాకబ్ బెథెల్, లుంగిసాని ఎంగిడి,లక్నో నుండి మార్ క్రమ్,పంజాబ్ నుండి మార్కో యాన్సెన్,ముంబై నుండి రికిల్ టన్,చెన్నై నుండి సామ్ కరన్,రాజస్థాన్‌కు జోఫ్రా ఆర్చర్ దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read:Rains:12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

