ఐపీఎల్ 2025 ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఐపీఎల్ మ్యాచ్‌లన్ని తీవ్రమైన వేడి వాతావరణం మధ్జ జరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. దీంతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారని తెలిపింది. కేవలం తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే సాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య సాగాయని వెల్లడించింది.
హిట్ ఫర్ సిక్స్..ద డేంజర్ జోన్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2025లో మెజార్టీ మ్యాచ్‌లు డేంజర్ జోన్‌లో నిర్వహించబడ్డాయని తెలిపింది. ఈ రకమైన పరిస్థితుల్లో మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
ఐపీఎల్ 2025లో ఆటగాళ్ల ఆరోగ్యంతో పాటు వాయు కాలుష్యం ఏర్పడిందని తెలిపారు. ఈ నివేదిక వాతావరణ మార్పులు క్రికెట్‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో స్పష్టంగా చూపిస్తుండగా ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని నివేదిక కోరుతోంది.
Also Read:మాల్దీవులకు మోడీ.. వివరాలివే

