ఐపీఎల్ 2025 ఫైనల్ రికార్డు టీఆర్పీ సాధించింది. జూన్ 3, 2025న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది ఆర్సీబీ. 18 ఏళ్ల తర్వాత RCB మొట్టమొదటిసారిగా టైటిల్ గెలుచుకోవడంతో పాటు టీవీ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16.9 కోట్ల (169 మిలియన్ల) మంది వీక్షించారు. ఇది భారతదేశంలోని టీవీ చానళ్లలో అత్యధికంగా వీక్షించిన కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. మ్యాచ్‌కు సంబంధించిన టీవీ రేటింగ్ (TVR) 11గా నమోదైంది. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక TVR. మొత్తం వీక్షణ సమయం (watch-time) పరంగా చూస్తే, ఈ మ్యాచ్‌ను 1500 కోట్ల నిమిషాలు(15 బిలియన్ నిమిషాలు) వీక్షించారు. ఇది కూడా ఒక సరికొత్త రికార్డు.
జియోస్టార్‌లో ఈ మ్యాచ్‌కు గరిష్టంగా 67.8 కోట్ల (678 మిలియన్ల) కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. రెండో ఇన్నింగ్స్‌లో RCB బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పినప్పుడు చివరి క్షణాల్లో వీక్షకులు 63 కోట్లు దాటారు.
Also Read:భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలు

