IPL 2025: ఢిల్లీ నాలుగో విజయం

18
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు విధించిన 164 పరుగుల టార్గెట్‌ను 17.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు 164 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93నాటౌట్‌గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 163 పరుగులు చేసింది. సాల్ట్ 37,కోహ్లీ 22,పాటిదార్ 25, టిమ్ డేవిడ్ 37 పరుగులు చేశారు. చివరలో డేవిడ్ సిక్సర్లతో విరుచకపడటంతో ఆర్సీబీ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కేఎల్ రాహుల్ క్యాచ్ ను డ్రాప్ చేసి పెద్దపొరపాటు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉండుంటే ఆర్సీబీ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉండేవి.

Also Read:IPL 2025:గుజరాత్ నాలుగో విజయం

- Advertisement -