ఐపీఎల్ 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మార్చి 22 నుండి టోర్నీ ప్రారంభం కానుండగా పది ఫ్రాంఛైజీలు టైటిల్ కోసం తలపడనున్నాయి. తొలి మ్యాచ్ కోల్కతా నైట్రైర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది.
ఢిల్లీ, ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఇక ఈ సారి టీమ్స్, కెప్టెన్స్ వివరాలను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్, సన్రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్, చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
Also Read:IPL 2025 : డీసీ కెప్టెన్గా అక్షర్
అలాగే కోల్కతా నైట్రైడర్స్ – అజింక్యా రహానే, లక్నో సూపర్ జెయింట్స్ – రిషబ్ పంత్, పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్, ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్, గుజరాత్ టైటాన్స్ – శుభ్మన్ గిల్ కెప్టెన్స్గా వ్యవహరించనున్నారు.

