IPL 2024 :డీకే.. లాస్ట్ ఐపీఎల్?

53
- Advertisement -

ఐపీఎల్ 17 వ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. నిన్న పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45), జితేష్ శర్మ(27), ప్రభుసిమ్రాన్ సింగ్ (25) పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలేనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (77) అద్భుత ఇన్నింగ్స్ తో చెలరేగగా.. చివర్లో దినేష్ కార్తీక్ (28) మెరుపులు మెరిపించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

దినేష్ కార్తీక్.. లాస్ట్ ఐపీఎల్
గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన దినేష్ కార్తీక్ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో తనదైన రీతిలో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతూ బెస్ట్ ఫినిషర్ గా ధోని తర్వాత నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు, అయితే డీకేకు ఇదే లాస్ట్ సీజన్ ఐపీఎల్ అనే క్రీడా వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సీజన్ లో ఎలాగైనా ఆర్సీబీకి కప్పు అందించాలనే లక్ష్యంతో డీకే అద్బుతంగా రాణిస్తున్నట్లు తెలుస్తోంది.

నేటి మ్యాచ్ లు
ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ ల విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటల మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఈ రెండు జట్లు రెండో విజయం కోసం పోటీ పడుతున్నాయి. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:Kavitha:కడిగిన ముత్యంలా బయటకువస్తా

- Advertisement -